కడప జిల్లా బ్రహ్మంగారి మఠం (బి.మఠం) మండలం దొడ్ల డైరీ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ, స్కూటర్‌ను బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఎదురుగా వస్తున్న స్కూటర్‌పైకి లారీ దూసుకురావడంతో ఈ ప్రమాదం సంభవించింది. లారీ చక్రాల కింద పడి మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాద తీవ్రతకు స్కూటర్ లారీ కింది భాగంలో ఇరుక్కుపోయింది. ఘర్షణ (Friction) కారణంగా లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీలో మంటలు వ్యాపించడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, నీటితో మంటలను అదుపు చేశారు. లేదంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
