కడపలో వైసీపీ ఖాళీ.. TDPలోకి మరో ఇద్దరు కార్పొరేటర్లు

February 28, 2026 1:11 PM

వైఎస్సార్ జిల్లా కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల పరంపర కొనసాగుతోంది. కడప కార్పొరేషన్‌లో ఆ పార్టీ బలం రోజురోజుకూ తగ్గుతోంది. తాజాగా వైసీపీకి చెందిన మరో ఇద్దరు కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

కడప మేయర్ సురేష్ బాబు మరియు టీడీపీ కీలక నేతల సమక్షంలో ఈ ఇద్దరు కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీ మారుతున్నట్లు వారు ప్రకటించారు. గత కొద్దిరోజులుగా కడప కార్పొరేషన్‌లో వరుసగా కార్పొరేటర్లు జంప్ అవుతుండటంతో వైఎస్సార్‌సీపీ ఇక్కడ ఆత్మరక్షణలో పడింది. మేయర్‌తో సహా మెజారిటీ కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీ వైపు మొగ్గు చూపడం గమనార్హం. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా భావించే కడప నగరంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో మరికొంతమంది నేతలు కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.ఈ చేరికతో కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో తెలుగుదేశం పార్టీ బలం గణనీయంగా పెరిగింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media