TTD బోర్డు కీలక నిర్ణయాలు రూ. 5400 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు

February 28, 2026 2:40 PM

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన శనివారం అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమైంది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం, ఆలయ అభివృద్ధి కోసం మొత్తం 87 అంశాలపై బోర్డు సుదీర్ఘంగా చర్చిస్తోంది.

టీటీడీ వార్షిక బడ్జెట్ కోసం రూ. 5400 కోట్ల ప్రతిపాదనలపై మండలి చర్చించింది. ప్రపంచస్థాయి టెక్నాలజీతో నూతన అదనపు అన్నదాన భవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణానికి రిలయన్స్ సంస్థ ముందుకు రావడం విశేషం. అలిపిరి తనిఖీ కేంద్రంలో లగేజీ స్కానింగ్ కోసం అత్యాధునిక ఎక్స్-రే పరికరాల ఏర్పాటు, ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా భద్రతా సిబ్బంది నియామకంపై నిర్ణయం తీసుకోనున్నారు.
టీటీడీ విద్యాసంస్థల ప్రమాణాలు పెంచేందుకు రూ. 116 కోట్లు వెచ్చించనున్నారు.ఒంటిమిట్ట కోదండరామ స్వామి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఉచిత లడ్డూల పంపిణీ.వకుళమాత ఆలయంలో చిన్నారుల కోసం ‘గోవింద అక్షరమాల’ కార్యక్రమం.51 మంది అర్చకులకు పదోన్నతులు కల్పించే అంశంపై చర్చ.ఆధునిక సాంకేతికతతో కానుకల సమర్పణకు ‘శ్రీవారి ముడుపుల పత్రం’ అమలు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media