AP:హెడ్ కానిస్టేబుల్ దేవ ప్రసాద్‌కు SP ఘన వీడ్కోలు!

February 28, 2026 3:31 PM

అంకితభావం, క్రమశిక్షణతో పోలీస్ శాఖకు అందించిన సేవలు ఎంతో విలువైనవని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కొనియాడారు. ఫిబ్రవరి నెలాఖరున పదవీ విరమణ పొందిన కడప టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ వి.ఎస్. దేవ ప్రసాద్ ను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు పలికారు.

రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడానికి కింది స్థాయి సిబ్బంది కృషీ ఎంతో ఉందని ఎస్పీ పేర్కొన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహించడం సామాన్యం కాదని ప్రశంసించారు. పదవీ విరమణ అనేది ఒక కొత్త అధ్యాయమని, ఇకపై కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూనే సొంత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని దేవ ప్రసాద్‌కు ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) కె. ప్రకాష్ బాబు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ మరియు పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఎస్పీ చేతుల మీదుగా జ్ఞాపికను అందుకున్న దేవ ప్రసాద్‌ను తోటి సిబ్బంది అభినందనలతో ముంచెత్తారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media