శ్రీకాకుళం BC వెల్ఫేర్ ఆఫీసర్ ఇంట్లో ACB సోదాలు.

March 3, 2026 11:30 AM

అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ (ABCWO) గడ్డి బాలముకుందరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోమవారం ఉదయం నుంచి విస్తృత సోదాలు నిర్వహించారు. గత నెలలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటనకు సంబంధించి అక్రమ ఆస్తుల గుర్తింపు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.

జనవరి 28వ తేదీన కంచిలిలో వార్డెన్ల నుంచి రూ. 1.84 లక్షలు లంచం తీసుకుంటుండగా బాలముకుందరావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీసీ వసతి గృహాల్లో ఉంటున్న ఒక్కో విద్యార్థి నుంచి నెలవారీ రూ. 5 చొప్పున వసూలు చేయాలని వార్డెన్లపై ఒత్తిడి తెచ్చినట్లు ఇతనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. సోమవారం శ్రీకాకుళం నగరంలోని డీసీసీబీ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో బృందాలు సోదాలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు మరియు అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆధారాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది.లంచం కేసులో అరెస్టయిన అధికారి ఆస్తులపై లోతైన విచారణ జరుపుతున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media