AP:వాసుపల్లి ఇంటికి జగన్.. నూతన వధూవరులకు ఆశీర్వాదాలు

March 5, 2026 10:37 AM

ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా Y. S. Jagan Mohan Reddy విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే Vasupalli Ganesh Kumar నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. మహిళలు హారతులు ఇచ్చి పూలాభిషేకంతో స్వాగతం పలికారు.

ఇటీవల వివాహం చేసుకున్న వాసుపల్లి రెండో కుమారుడు సాకేత్, శ్రావణి దంపతులను జగన్ ఆశీర్వదించి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమై ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజల తరఫున పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శించిన ఆయన, కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. భవిష్యత్తు వైసిపిదేనని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కన్నబాబు, మాజీ ఎంపీ సత్యవతి, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ తదితర నాయకులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media