ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో కుంభాభిషేక ఏర్పాట్ల పరిశీలన

March 5, 2026 10:47 AM

విజయవాడలోని Sri Durga Malleswara Swamy Temple లో మార్చి 6 నుంచి 8 వరకు జరగనున్న కుంభాభిషేక కార్యక్రమాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి Anam Ramanarayana Reddy స్థానిక ఎమ్మెల్యే Sujana Chowdary తో కలిసి పరిశీలించారు.

కుంభాభిషేక కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్ మంత్రికి వివరించారు. విమాన గోపురం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం మంత్రి, ఎమ్మెల్యే కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైర్మన్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో కుంభాభిషేకానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media