సచివాలయంలో చేనేత స్టాళ్లను ప్రారంభించిన మంత్రి సవిత

March 5, 2026 11:05 AM

జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలోని Andhra Pradesh Secretariat లో ప్రత్యేక చేనేత స్టాళ్లను రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి S. Savitha ప్రారంభించారు.

ఈ స్టాళ్లలో వెంకటగిరి, గద్వాల్, ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి వంటి ప్రసిద్ధ చేనేత చీరలు, రెడీమేడ్ వస్త్రాలను 50 శాతం డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ స్టాళ్లు ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి.రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించడమే లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. అలాగే ఏప్రిల్ 1 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన స్టాళ్లకు ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media