గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలను ఎమ్మెల్యే Galla Madhavi ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడిగా 49వ డివిజన్‌కు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు జొన్నలగడ్డ ఉదయభాను (చింటు)ను నియమించారు.
ఉదయభాను గతంలో తెలుగు విద్యార్థి విభాగం, తెలుగు యువతలో కార్యదర్శి మరియు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన నియామకాన్ని నియోజకవర్గంలోని చర్చి పాస్టర్లు, ఫాదర్లు మరియు క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు స్వాగతించారు.నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత క్రిస్టియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కర్ర హోనక్ బెంజిమెన్, టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు సిరిపురపు శ్రీధర్, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. జోసఫ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.క్రిస్టియన్ వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ఉదయభాను కీలక పాత్ర పోషిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే గల్లా మాధవికి ఉదయభాను కృతజ్ఞతలు తెలిపారు.
