రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థంగా అందించేందుకు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (FBMS) పై ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అసెంబ్లీలోని తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ ఐడీ ఆధారంగా 26 అంశాలతో కూడిన డేటాబేస్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఆధార్ నెంబర్, రైస్ కార్డ్ ఐడీ, విద్యార్హతలు, వృత్తి, మొబైల్ నెంబర్, చిరునామా, వ్యవసాయ భూమి, అర్బన్-రూరల్ ప్రాపర్టీ వంటి వివరాలు ఉండనున్నాయి.
ఎస్‌జీఎస్‌డబ్ల్యు, డిస్కమ్స్, ఎంఏయూడీ, వెబ్‌ల్యాండ్, వాహన్, హెచ్ఆర్ఎంఎస్, పంచాయతీరాజ్, మార్క్‌ఫెడ్ తదితర శాఖల సమాచారం కూడా ఈ డేటాబేస్‌లో సమీకరించాలని సీఎం సూచించారు. ప్రస్తుతం 82 శాతం సమాచారం సిద్ధంగా ఉండగా, ఏప్రిల్ 30 నాటికి 90 శాతం డేటాబేస్ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
