Kamareddy district లోని Bikkanoor సౌత్ క్యాంపస్ బాలుర వసతి గృహంలో సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం.

గొడవకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్ వద్ద విద్యార్థులు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

