AP:పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునఃప్రారంభం

March 5, 2026 12:50 PM

నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం చంద్రగ్రహణం ముగియడంతో మళ్లీ భక్తులకు తెరుచుకుంది. గ్రహణ మోక్షం అనంతరం అర్చకులు ఆలయ ద్వారాలను తెరిచి స్వామివారికి ప్రత్యేక సంప్రోక్షణ, శుద్ధి పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన తరువాత భక్తులను దర్శనాలకు అనుమతించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. గ్రహణం కారణంగా నిలిచిపోయిన నిత్య కైంకర్యాలు తిరిగి యథావిధిగా ప్రారంభమయ్యాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media