AP:తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

March 5, 2026 2:13 PM

తిరుమలలో పలువురు ప్రముఖులు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ ఎంపీ జి కృష్ణయ్య, మాజీ భారత క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, తమిళ సినీ నటుడు నీలగిరి రవి, ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, సినీ నటి మిత్రావ్ శర్మ శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media