గుంటూరు జిల్లా పెద్దకాకాని రైల్వే స్టేషన్ వద్ద హత్య ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తిని గొంతు కోసి అగంతకులు హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. మృతుడు రైల్వే ప్రయాణికుడా లేదా ఎక్కడైనా హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడి వివరాలు మరియు హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
