మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా అనేక విమానాలు రద్దు కావడంతో దుబాయ్లో వేలాది మంది ప్రయాణికులు ఇరుక్కున్నారు. ఈ పరిస్థితిలో బాలీవుడ్ నటుడు Sonu Sood మానవత్వాన్ని చాటుతూ ముందుకొచ్చారు.
దుబాయ్లో చిక్కుకున్న వారికి ఉచితంగా వసతి కల్పిస్తానని ఆయన ప్రకటించారు. “ఎవరైనా దుబాయ్లో ఇరుక్కుపోయి ఉండి ఉండటానికి చోటు లేకపోతే మాకు మెసేజ్ చేయండి. ఎలాంటి జాతి, దేశం అనే తేడా లేదు… మానవత్వమే ముఖ్యం” అని సోషల్ మీడియాలో తెలిపారు.ప్రయాణికులు సహాయం కావాలంటే తనకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయాలని ఆయన సూచించారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల విమాన సేవలు అంతరాయం కలగడంతో అనేక మంది విదేశీయులు దుబాయ్లో చిక్కుకుపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
