శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు ఆసక్తిగా ఎదురుచూసే పవిత్ర కిరణదర్శనం ఈ నెల మార్చి 9, 10 తేదీల్లో జరగనుంది. వాతావరణం అనుకూలిస్తే ఉదయం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి స్వామివారి పాదాలపై పడే అరుదైన దృశ్యం భక్తులకు దర్శనమిస్తుంది.

ఈ విశేష దర్శనాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజుల్లో మబ్బులు లేదా పొగమంచు లేకుండా వాతావరణం అనుకూలంగా ఉండాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.
