వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎండల్లో రేషన్ దుకాణాల వద్ద ఎక్కువసేపు వేచి ఉండకుండా ఉండేందుకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఏప్రిల్ నెలలోనే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకే విడతలో అందించనున్నారు. సాధారణంగా ప్రతి నెల రేషన్‌ను ఆ నెలలోనే అందిస్తారు. అయితే ఈసారి వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర పౌరసరఫరాల శాఖ ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది.ఈ విషయంపై అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
