AP:జీరో పావర్టీ మిషన్‌పై CM చంద్రబాబు సమీక్ష

March 6, 2026 10:13 AM

రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి పేదల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు జీరో పావర్టీ మిషన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలో సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ విభాగాలతో కుటుంబ సాధికారితపై సమీక్ష నిర్వహించారు. సమన్వయ వ్యూహంతో పేదరిక నిర్మూలనకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా జీరో పావర్టీ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణించి ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ఈ మిషన్‌ను బలంగా అమలు చేయాలని తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media