అంగన్‌వాడీ కార్మికుల పోరాటానికి CITU సంఘీభావం

March 6, 2026 10:55 AM

అంగన్‌వాడీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటానికి Centre of Indian Trade Unions సంఘీభావం ప్రకటించింది. లక్ష్మివానిపాలెం సమీపంలోని B. R. Ambedkar విగ్రహం వద్ద ఫ్లకార్డులు పట్టుకుని గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐటియు జోన్ అధ్యక్షుడు డి.అప్పలరాజు మాట్లాడుతూ శాంతియుతంగా దీక్షలు చేస్తున్న అంగన్‌వాడీ కార్మికులను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. కార్మికుల పోరాటాలను నిర్బంధాలతో అణిచివేయాలని ప్రయత్నించడం సరైంది కాదని విమర్శించారు. అంగన్‌వాడీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media