విజయవాడలోని Kanaka Durga Templeలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కృష్ణా నది నుంచి సేకరించిన పవిత్ర జలాలతో నిర్వహించిన కలశ ఊరేగింపుతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

కలశాలను యాగశాలకు తీసుకెళ్లిన అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైదిక కమిటీ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఉత్సవాలపై వంశపారంపర్య ప్రధాన అర్చకులు లింగంబట్ల దుర్గాప్రసాద్ వివరించారు.Shankar Vijayendra Saraswati పర్యవేక్షణలో ఆగమ శాస్త్ర ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
