Sri Venkateswara Swamy Temple, Vadapalli ఆలయంలో భక్తులు విశేషమైన విరాళాన్ని సమర్పించారు. తణుకు నివాసితులు శ్రీ పుణ్యమూర్తుల రామచంద్ర స్వామి, శ్రీమతి సావిత్రి దంపతులు సుమారు 350 గ్రాముల బంగారంతో తయారు చేసిన మకర తోరణాన్ని ఆలయానికి సమర్పించారు.

దాదాపు రూ.60 లక్షల విలువైన ఈ బంగారు మకర తోరణాన్ని వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావుకు అందజేశారు. అనంతరం ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి, స్వామివారికి ఈ మకర తోరణాన్ని అలంకరించారు.

