మేడ్చల్‌లో బీరు సీసాలో పాకురు..The బీర్ స్టోరీ

March 6, 2026 5:06 PM

Medchalలో బీరు సీసాలో పాకురు కనిపించడం కలకలం రేపింది. భానుడి భగభగకు చల్లగా ఓ బీరు తాగుదామని వెళ్లిన యువకుడు అవాక్కకు గురయ్యాడు మేడ్చల్ చెక్‌పోస్ట్ సమీపంలోని కనకదుర్గ వైన్ షాపులో రాజు అనే యువకుడు KF లైట్ బీరు కొనుగోలు చేసి పర్మిట్ రూములో తాగుతుండగా రుచిలో తేడా గమనించాడు.

సీసాను పరిశీలించగా అందులో పాకురు ఉన్నట్లు గుర్తించి వెంటనే వైన్ షాపు సిబ్బందిని ప్రశ్నించాడు. నాణ్యత లేని బీరు ఎలా విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికే కొంత బీరు తాగినందున ఆరోగ్యానికి హాని జరిగితే బాధ్యులు ఎవరు అని ప్రశ్నించాడు.ఈ ఘటనపై ఆప్కారి శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media