విజయవాడలో కాల్పులు గన్‌తో వచ్చిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు

March 7, 2026 12:17 PM

Vijayawadaలో కాల్పుల కలకలం రేగింది. బస్ స్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్ వద్ద పోలీసులు, ఈగల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి గన్‌తో కాల్పులకు ప్రయత్నించాడు. అయితే ట్రిగ్గర్ నొక్కినా బులెట్ ఛాంబర్‌లోకి రాకపోవడంతో కాల్పులు జరగలేదని పోలీసులు గుర్తించారు.

ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. అతను Nellikuduruకు చెందినవాడిగా గుర్తించారు. అతడి వద్ద నుంచి 9 ఎమ్‌ఎమ్ పిస్టల్‌తో పాటు ఐదు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media