Utnoorలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు నిరసనకు దిగారు. ఇంగ్లీష్ లెక్చరర్ Koravi Pratyusha తమను అవమానకరంగా దూషిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు పీఎంఆర్సీ ముందు ఎండలో ధర్నా చేపట్టారు.
లెక్చరర్‌ను సస్పెండ్ చేసే వరకు తమ నిరసన కొనసాగిస్తామని విద్యార్థినులు స్పష్టం చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉపాధ్యాయులు, పోలీసులు విద్యార్థినులతో చర్చించారు.
