Goa పర్యటనలో ఉన్న అవనిగడ్డ ఎమ్మెల్యే Mandali Buddha Prasad గోవా గవర్నర్ Pusapati Ashok Gajapathi Rajuను లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్–విజయలక్ష్మి దంపతులు, యువనాయకులు మండలి వెంకట్రామ్–సాయి సుప్రియ దంపతులు కూడా పాల్గొన్నారు.
తరువాత గవర్నర్తో కలిసి లోక్ భవన్ ప్రాంగణంలోని సుమారు 500 ఏళ్ల నాటి పోర్చుగీసు చర్చిని సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అశోక్ గజపతి రాజు ఆదర్శ రాజకీయవేత్త అని, ఆయన నిరాడంబరత మరియు సేవా భావం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
