Abhilash Sunkara హీరోగా నటించిన Cockroach చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం Choppella గ్రామానికి చెందిన అభిలాష్ సుంకర స్టంట్‌మన్‌గా సినీ రంగంలో ప్రవేశించి సుమారు 400కు పైగా చిత్రాల్లో పనిచేసి మంచి గుర్తింపు పొందారు.

మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయన యాక్షన్ సన్నివేశాల్లో తన ప్రతిభతో దర్శక నిర్మాతల ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ దర్శకుడు P. Sunil Kumar Reddy దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యాక్షన్, భావోద్వేగాలు, సామాజిక సందేశంతో రూపొందిందని చిత్రబృందం తెలిపింది.

ఈ చిత్రం రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, మండపేట, పిఠాపురం ప్రాంతాల్లో థియేటర్లలో విడుదలైంది.
