Payakaraopetaలోని పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. G. Appanna సూచనలతో స్థానిక Sri Prakash School విద్యార్థులను స్టేషన్‌కు ఆహ్వానించి ఓపెన్ హౌస్ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్ రూమ్, లాక్‌ప్ గదులు, రికార్డులు, ఎస్‌హెచ్‌వో బాధ్యతల గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే పిస్టల్ పనితీరు, పోలీసుల విధులు, మహిళలపై జరిగే నేరాలు, పోక్సో కేసులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పోలీసుల పనితీరు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అధికారులు తెలిపారు.
