Kadapa districtలో విషాద ఘటన చోటుచేసుకుంది. Nadimpalliలోని పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థికి ఫిట్స్ రావడంతో అస్వస్థతకు గురయ్యాడు.
ఈ విషయం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారు వచ్చే వరకు విద్యార్థిని పాఠశాలలోనే ఉంచారని తెలుస్తోంది. అనంతరం తల్లిదండ్రులు అతడిని Proddatur జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.పాఠశాల హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణమని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
