తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివంగత ప్రజాగాయకుడు గద్దర్ పేరిట ప్రారంభించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జాబితాను శనివారం విడుదల చేసింది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఈ అవార్డుల పూర్తి జాబితాను ప్రకటించారు. ఉగాది సందర్భంగా మార్చి 19న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా నాగ చైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్) ఎంపికయ్యారు. అలాగే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు చిరంజీవికి, పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్‌కు దక్కాయి.ఇతర విభాగాల్లో సుద్దాల అశోక్ తేజకు సినారె అవార్డు, జయసుధకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు లభించాయి. ఈ అవార్డుల జాబితాను జ్యూరీ సభ్యులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అందజేశారు.
