రాయచోటి పట్టణంలోని రాయుడు కాలనీలో పోలీసులు నాకాబంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, తహసీల్దార్ నర్సింహకుమార్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు.

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆధార్, బ్యాంక్ వంటి వ్యక్తిగత వివరాలను అనుమానితులకు ఇవ్వకూడదని తెలిపారు. అలాగే సరైన పత్రాలు ఉన్న వాహనాలనే కొనుగోలు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.అన్నమయ్య జిల్లాను మత్తు పదార్థాలు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
