Sundar Pichai వేతనాన్ని Alphabet Inc. పెంచింది. Google సీఈఓగా కొనసాగుతున్న పిచాయ్‌కు రాబోయే మూడు సంవత్సరాల కాలానికి సుమారు 692 మిలియన్ డాలర్లు (రూ.6,300 కోట్లకు పైగా) వేతనం అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ నిర్ణయంతో పిచాయ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓల్లో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం Artificial Intelligence ప్రభావంతో టెక్ ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో పిచాయ్ నాయకత్వంపై విశ్వాసంతో ఆల్ఫాబెట్ ఈ వేతన పెంపును ప్రకటించినట్లు సమాచారం.
