Warangal నగరంలోని జేపీఎన్ రోడ్డులో ఉన్న దత్తాత్రేయ ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షాప్లో చెలరేగిన మంటలు పక్కనున్న దుకాణాలకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
