Dr. B. R. Ambedkar Konaseema Yanam–Edurlanka Bridge (యానాం–ఎదుర్లంక బాలయోగి వారధి) పై నుంచి ఓ వ్యక్తి గోదావరిలోకి దూకిన ఘటన కలకలం రేపింది.
వారధిపై తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి గోదావరిలోకి దూకినట్లు స్థానికులు తెలిపారు. వాహనంలో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా గోదావరిలోకి దూకిన వ్యక్తి అల్లవరం మండలం బోడసకుర్రుకు చెందిన కొబ్బరి ఒలుపు కార్మికుడు పోలిశెట్టి ధనరాజుగా గుర్తిస్తున్నట్లు సమాచారం.ధనరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. ఘటనపై సమాచారం అందుకున్న ఐ.పోలవరం పోలీసులు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు.
