Madhurawadaలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివేకానంద కాలనీ గణేష్ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఉచిత వైద్య అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ కార్పొరేటర్ Molli Hemalatha హాజరై మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. శిబిరంలో మహిళలు, గర్భిణీలు, చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు.
