మంగళగిరి నులకపేటలో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన లోకేష్

March 9, 2026 4:58 PM

Nara Lokesh మంగళగిరి నియోజకవర్గం Mangalagiriలోని తాడేపల్లి పట్టణం నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో సుమారు రూ.65 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించబడింది.

కార్యక్రమానికి వచ్చిన మంత్రి లోకేష్‌కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి.చంద్ర కిరణ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media