Rapur మండలం ఆంజనేయపురం STవాసులు తమ సాగులో ఉన్న భూమిపై కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సోమవారం Nellore districtలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మీనరసింహంకు వినతి పత్రం సమర్పించారు.

1142/5A సర్వే నంబర్లో ఉన్న భూమిని గత 30 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని బాధితులు తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు ఆ భూమిని అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భూమిని అమ్మలేదని, కేవలం లీజుకు ఇచ్చామని స్పష్టం చేశారు.ఈ విషయంపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని తహసీల్దార్‌ను వారు కోరారు.
