Greater Visakhapatnam Municipal Corporation అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు ప్రారంభించింది. Visakhapatnamలోని తిమ్మాపురం బీచ్ రోడ్ ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్మించి నిర్వహిస్తున్న విరాగో పబ్ ను అధికారులు సీజ్ చేశారు.
పరిశీలనలో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా పబ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు జీవీఎంసీ అధికారులు తెలిపారు.
