Nalgonda districtలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. Chandur మండలం తుమ్మలపల్లి గ్రామం వద్ద రోడ్డు విస్తరణ పనుల కోసం వెళ్తున్న టిప్పర్ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు అధికారులు తెలిపారు. కొద్దిసేపట్లోనే టిప్పర్ లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడగా అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
