Bengal Tiger ఇటీవల Rajanagaram, Rajamahendravaram పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజల్లో ఆందోళన కలిగించిన పెద్దపులిని అటవీ శాఖ అధికారులు పట్టుకుని Visakhapatnamకు తరలించారు. అనంతరం దాన్ని Polavaram అటవీ ప్రాంతంలో వదిలారు.
పులి కదలికలను గమనించేందుకు ట్రాకింగ్ చిప్ అమర్చి, డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం పోలవరం గట్టు ప్రాంతంలో పులి విశ్రాంతి తీసుకుంటున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.అటవీ ప్రాంతాలకు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రివేళల్లో బయటకు వెళ్లకూడదని, పశువులను అడవి అంచులకు తీసుకెళ్లవద్దని హెచ్చరించారు.