Tirumala లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారం హిందూ శాస్త్ర నియమాల ఉల్లంఘనగా పరిగణించాలని Swami Paramatmananda Saraswati పేర్కొన్నారు.

Amaravatiలో విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయం హిందూ సమాజ భావోద్వేగాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. శాస్త్ర ప్రకారం దేవాలయ నైవేద్యంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.ఈ వ్యవహారాన్ని కేవలం ఆహార కల్తీగా కాకుండా హిందూ ధర్మ ఆచారాలకు విరుద్ధంగా జరిగిన ఘటనగా చూడాలని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ‘ద్రవ్య శుద్ధి’పై శాస్త్ర, ఆగమ నియమాల ప్రకారం సదస్సులు, సెమినార్లు నిర్వహించాలని సూచించారు. దేవాలయ నిర్వహణను అత్యంత పవిత్రంగా భావించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

