Bheemunipatnam సమీపంలోని Avanti Engineering Collegeలో “Apotheke 2K26 – Bridging the Gap: From Traditional Practice to Artificial Intelligence Integrated Pharmacy” పేరుతో జాతీయ స్థాయి శాస్త్రీయ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అవంతి విద్యాసంస్థల చైర్మన్, మాజీ మంత్రి Muttamsetti Srinivasa Rao ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫార్మసీ విద్యతో విద్యార్థులకు అధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పాఠ్య పుస్తకాల సిద్ధాంతాలతో పాటు ప్రయోగాత్మక నైపుణ్యాలపై కూడా దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు.ఈ సమావేశానికి దేశంలోని సుమారు 16 కళాశాలల నుంచి 820 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫార్మసీ రంగంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతోందని, విద్యార్థులు సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు.

