Kadapa district జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ Shelke Nachiket Vishwanath పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు.

జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 156 ఫిర్యాదులు పిజిఆర్ఎస్కు వచ్చినట్లు తెలిపారు. సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులను చట్టపరమైన పరిధిలో నిర్ణీత గడువులో పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్చైర్లు ఏర్పాటు చేసి వారి వద్దకే వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులకు న్యాయం అందేలా పోలీసులు చర్యలు తీసుకుంటారని ఎస్పీ భరోసా ఇచ్చారు.
