Secunderabadలో 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా Sanath Nagar నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట్ ప్రాంతాన్ని కలెక్టర్ Dasari Hari Chandana సందర్శించారు. Greater Hyderabad Municipal Corporation కమిషనర్ Karnanతో కలిసి వాంబే పథకంలో నిర్మించిన శిథిలావస్థకు చేరిన నాలుగు బ్లాకుల భవనాలను పరిశీలించారు.
భవనాల గోడలు బీటలు వారడం, స్లాబుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్న పరిస్థితిని గమనించారు. అలాగే అంగన్వాడీ కేంద్రం, గాంధీ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.
ప్రాంతంలో ఉన్న రెండు ఖాళీ స్థలాల్లో పిల్లల పార్కులను అభివృద్ధి చేయాలని జోనల్ అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారుల నివేదిక ఆధారంగా భవనాలను కూల్చి కొత్తవి నిర్మించాలా లేదా మరమ్మతులు చేయాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
