Husnabad నియోజకవర్గంలోని పోతారం (ఎస్) గ్రామంలో మంత్రి Ponnam Prabhakar పర్యటించారు. ఈ సందర్భంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం ఎఫ్‌ఎండీ (FMD) ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలో పశుసంపదను పెంచడం, వ్యాధులను నివారించడం కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉచితంగా ఎఫ్‌ఎండీ టీకాలు వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతులు పాడి సంపదను పెంచి పాల ఉత్పత్తిని పెంచాలని ఆయన కోరారు.
అదే కార్యక్రమంలో ఇందిరా మహిళా శక్తి పరమేశ్వర సిమెంట్ బ్రిక్స్ ఇండస్ట్రీని కూడా మంత్రి ప్రారంభించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలని, ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
