Amaravati రాజధానిని తెలుగు సంస్కృతి, వైభవాన్ని ప్రపంచానికి చాటేలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన 59వ Andhra Pradesh Capital Region Development Authority (సీఆర్డీఏ) అథారిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని, పెట్టుబడులు పెట్టే సంస్థలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని అధికారులకు సూచించారు. నీరుకొండ ప్రాంతంలో సుమారు 167 ఎకరాల్లో టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేసి వాటర్ ఫ్రంట్, కల్చరల్ సెంటర్, హోటళ్లు, అమ్యూజ్మెంట్ పార్క్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
క్రీడలు భవిష్యత్తులో పెద్ద ఆదాయ వనరుగా మారనున్న నేపథ్యంలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో పలు భూ కేటాయింపులు మరియు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి రూ.2316 కోట్ల పరిపాలనా అనుమతులు ఇవ్వగా, రూ.119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది.
