ఇసుక ర్యాంప్ వ్యవహారం.. లంచం డిమాండ్ చేసిన SI?

March 10, 2026 3:46 PM

Mahabubabad జిల్లాలోని Chinnagudur మండలంలో ఇసుక ర్యాంప్ డీల్ వ్యవహారం వివాదంగా మారింది. ఇసుక ర్యాంప్ వ్యవహారంలో తలదూర్చిన ఓ ఎస్సై రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో రూ.20 వేల రూపాయలను ఫోన్‌పే ద్వారా చెల్లించగా, మిగిలిన రూ.80 వేలును మూడు రోజుల్లో ఇస్తామని పేర్కొన్న స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ విషయంపై వివరాలు వెల్లడించేందుకు మీడియా ముందుకు వచ్చిన ఆంగోత్ బాలకృష్ణ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవాలు చెప్పడం నేరమా అంటూ బాలకృష్ణ దంపతులను వెంటనే విడుదల చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media