కూటమి పాలన సంక్షేమానికి స్వర్ణయుగం మంత్రి డోలా బాల స్వామి

March 10, 2026 4:15 PM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమానికి నిజమైన స్వర్ణయుగం ప్రారంభమైందని మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 63 లక్షల మందికి ప్రతి నెలా రూ.2700 కోట్లకు పైగా పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు.అలాగే దీపం-2 పథకం కింద అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు.విద్యారంగంలో తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media