రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి ఆనం

March 10, 2026 4:18 PM

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం యనమదల గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. “మీ భూమి – మీ హక్కు” నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ రాజముద్ర, క్యూ ఆర్ కోడ్‌తో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు.

క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూ యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే కనిపించేలా ఈ పాస్ పుస్తకాలను రూపొందించామని మంత్రి తెలిపారు. రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా సీఎం సహాయనిధి చెక్కులను కూడా లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. అలాగే యనమదల గ్రామంలో సిమెంట్ రోడ్డు ప్రారంభం, గోకులం షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, గంగమ్మతల్లి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ చేశారు.

ప్రజల సంక్షేమం, గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media