Hyderabad నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటల్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. గ్యాస్ సరఫరా సమస్యల వల్ల హోటళ్ల కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున భవిష్యత్ కార్యాచరణపై హోటల్ యాజమాన్యాలు చర్చించాయి.

ఇప్పటికే Bengaluruలో హోటల్ యాజమాన్యాలు గ్యాస్ కొరతకు నిరసనగా సమ్మెబాట పట్టగా, Chennai హోటల్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి సమస్యను పరిష్కరించాలని కోరింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇతర నగరాల్లో కూడా హోటల్ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందని యాజమాన్యాలు పేర్కొన్నాయి.
