అనంతపురం మున్సిపల్ కార్యాలయంలో ACB సోదాలు

March 11, 2026 9:49 AM

Anantapurలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో Andhra Pradesh Anti-Corruption Bureau (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగంలో ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.

పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ విభాగంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం.రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రణాళిక విభాగాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు కొనసాగుతున్నాయని డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు.

రికార్డుల పరిశీలన అనంతరం ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media